Breaking News

క్రీడలు

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి
సామాజిక సారథి, నాగర్​ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు …
ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌
ఒలంపిక్స్‌ బాయ్‌ కాట్‌ పై అమెరికాకు చైనా వార్నింగ్‌ బీజింగ్‌: వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ను అమెరికా బాయ్‌కాట్‌ చేసింది. దీనిపై డ్రాగన్‌ దేశం చైనా రియాక్ట్‌ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా …
నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం
సామాజిక సారథి, రామాయంపేట: నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో  మెదక్ జిల్లా టీం ఛాంపియన్ లుగా నిలిచారు. ఈ నెల 3,4,5  తేదీలలో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ …
జాతీయ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం
సామాజిక సారథి‌, వైరా: వైరాలోని సత్యసాయి వేద పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంబమూర్తి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు …
హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు
సారథి ప్రతినిధి, జగిత్యాల: కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి హెచ్ సీఏలో ఆరుగురు సభ్యులను అధ్యక్షుడు మహమద్ అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ ‌క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో …
దేశాన్ని కాపాడుకుందాం రండి..!
కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. చాలా కోట్ల వ్యాక్సిన్లు అందక, ఆక్సిజన్​ దొరక్క జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ సహా, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే సంపూర్ణ లాక్​ డౌన్​ దిశగా వెళ్లాయి. కొవిడ్​దెబ్బకు క్రికెట్​మెగాఈవెంట్​ఐపీఎల్​14వ సీజన్ను బీసీసీఐ రద్దుచేసింది. …
ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్
సారతథి, సిద్దిపేట ప్రతినిధి: ఉచిత హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంపును ప్రారంభించినట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామేర మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని స్థానిక …
ఐపీఎల్​పై కరోనా పడగ
టోర్నీ నిరవధిక వాయిదాసేఫ్​ ప్లేస్​ లోకి ప్లేయర్స్​బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ​ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ ​2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్​–19 పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో …
నేటి నుంచే ఐపీఎల్​ పండుగ
సారథి, క్రీడలు: క్రీడల్లో మహాసంరంభం.. 52 రోజుల పాటు 60 మ్యాచ్ ల మెగా ఈవెంట్ ఐపీఎల్​14వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టే బ్యాట్స్​మెన్లు, యార్కర్లు, కట్టర్లు, గూగ్లీలు, ప్లిప్పర్లు, క్యారమ్ బౌలింగ్​తో వారికి అడ్డుకట్ట …
టీ20లో ఇండియా ఘనవిజయం
అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్​లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్​లో చేదు అనుభవం ఎదురైనా …
మోడీ స్టేడియంలో రికార్డుల మోత
అహ్మదాబాద్‌: మోతేరా స్టేడియంలో రికార్డుల మోత మోగింది. స్పిన్‌ బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గుజరాత్​లోని అహ్మదాబాద్(మోతేరా) ​నరేంద్రమోడీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన డే అండ్​ …
గబ్బాలో టీమిండియా గర్జన
బ్రిస్బెన్: గబ్బా వేదికపై టీమిండియా తడాఖా చూపించింది. 4 టెస్టుల సిరీస్​లో భాగంగా కెప్టెన్​రహానే నేతృత్వంలోని జట్టు 2–1 తేడాతో బోర్డర్​–గవాస్కర్​ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదివరకు ఒక మ్యాచ్​డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత …
విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు
ముంబై: విరుష్క అభిమానులకు గుడ్​న్యూస్. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఈ మేరకు కోహ్లి ట్వీట్‌ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. …
భారత్​దే టీ20 సిరీస్​
హార్దిక్​ పాండ్యా వీరోచిత బ్యాటింగ్​హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్​ సిడ్నీ: పొట్టి క్రికెట్​లో టీమిండియా గట్టి సవాల్​ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా ఒక మ్యాచ్​మిగిలి ఉండగానే సీరిస్​ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 …
పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​
సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్​లో భాగంగా రెండో వన్డేలోనూ పరుగుల వరద పారింది. కంగారులను నిలువరించలేని టీమిండియా సిరీస్​ను చేజార్చుకుంది. ఆసీస్​51 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. మ్యాచ్​మిగిలి ఉండగానే 2‌‌‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను కైవసం …
పోరాడి ఓడిన కోహ్లీసేన
సిడ్నీ: ఆసీస్‌ టూర్​లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కోహ్లీసేన చివరిదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. ఆసీస్‌ విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 …
నేవీ బ్లూ జెర్సీలో టీమిండియా
ముంబయి: ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభంకానున్న టీ20, వన్డే టోర్నీల్లో కోహ్లిసేన న్యూజెర్సీలో కనిపిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ గా మారాయి. ఇప్పుడున్న బ్లూ రంగులో కాకుండా నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ …
‘ముంబై’ పాంచ్ ​పటాకా
మరోసారి విజేతగా నిలిచిన రోహిత్​ సేనఫైనల్​ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ ​ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్​ మరోసారి ఐపీఎల్ చాంపియన్​గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్​ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు …
హైదరాబాద్ ఘన విజయం
అబుదాబి: ఐపీఎల్​13లో కీలకమైన మ్యాచ్​లో సన్​రైజర్స్​హైదరాబాద్​ ఘనవిజయం సాధించింది. రాయల్​చాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్​రైజర్స్​కీలక ఆటగాళ్లు కేన్‌ …
హైదరాబాద్​ తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​
షార్జా: సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్​13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ ​మ్యాచ్​లో ముంబై ఇండియన్స్‌ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి …
రాజస్తాన్​ ఔట్​ !
దుబాయ్‌: ఐపీఎల్ ​సీజన్ 13లో భాగంగా దుబాయ్ ​వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్​)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్​ఆర్​) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్​ నిష్క్రమించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే …
కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి..
అబుదాబి: ఐపీఎల్‌ 13 సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌ ఇక ఇంటిబాట పట్టింది. ఆదివారం చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లే ఆఫ్​ రేసు నుంచి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. …
హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్
షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన 52వ మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఆరో విజయం. పాయింట్ల పట్టికలో ఫోర్త్​ ప్లేస్​కు చేరింది. ముందుగా ఆర్సీబీ నిర్దేశించిన …
‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​
అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​పంజాబ్​పై రాజస్తాన్​రాయల్స్​7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచిన పంజాబ్ ​దూకుడుకు బ్రేక్​ పడినట్లయింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి …
కింగ్స్‌ పంజాబ్‌ అజేయం
షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ …
తక్కువ స్కోరే.. ప్చ్​!
దుబాయ్‌: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిలపడింది. ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా జరిగిన 43వ మ్యాచ్​లో వార్నర్​సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్​పంజాబ్​12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్​ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో …
వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​
అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి …
చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ ​కింగ్స్​
షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్​తో జరిగిన 41వ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ ​చిత్తుగా ఓడింది. దీంతో ప్లే ఆఫ్ ​రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది. మొదట సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను …
ధోనీ అరుదైన రికార్డు
టీ20 క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిథ్యం వహించిన …
పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ
దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో …
ఆకట్టుకున్న గేల్.. పంజాబ్ ​గెలుపు
షార్జా: ఐపీఎల్‌ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్​లో కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్‌ ఆకట్టుకున్నాడు. …
శిఖర్ ​ధనాధన్.. ఢిల్లీ విన్​
దుబాయ్‌: ఐపీఎల్​13 సీరిస్​లో భాగంగా 30వ మ్యాచ్​.. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో విజయం సాధించింది. ముందు టాస్ ​గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 …
ప్చ్​.. సన్​రైజర్స్​!
దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన 29వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్​)పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్​కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు తడబాటుతో ఒకరి …
డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​
షార్జా: డివిలియర్స్ బ్యాట్స్​తో విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా నైట్ ​రైడర్స్​పై రాయల్​ చాలెంజర్స్​బెంగళూరు 82 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 195 పరుగుల టార్గెట్​ …
ఎదురులేని ‘ముంబై’
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా క్వింటాన్‌ డీకాక్‌ …
రాజస్తాన్​ మరోసారి..!
షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్‌ చతికిలపడింది. రాజస్తాన్‌ బ్యాట్స్​మెన్లు యశస్వి …
‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​
దుబాయ్‌: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్బ్ ​అనిపించింది. పంజాబ్​పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్​చేసి ఔరా అనిపించింది. …
‘ముంబై’దే మరోసారి పైచేయి
అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్​పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ …
ఆర్సీబీకి ఘోర పరాజయం
దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్ ​చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను …
‘హైదరాబాద్’​ పరాజయం
షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో …
పోరాడి ఓడిన ‘కోల్​కతా’
షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) చివరి దాకా పోరాటం చేసి ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సిక్సర్ల మోత మోగింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం …
‘సన్​రైజర్స్’ ​సూపర్​ విక్టరీ
దుబాయ్: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్​ కింగ్స్​తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సన్​రైజర్స్ ​హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన హైదరాబాద్ ​బ్యాటింగ్ ​ఎంచుకుంది. చెన్నైకి …
ప్రియమ్​​ గార్గ్​ మెరుపులు
దుబాయ్: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్ ​హైదరాబాద్ ​సన్​రైజర్స్​164 పరుగులు చేసింది. చివరిలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మైమరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే …
ముంబై జయకేతనం
అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో కింగ్స్ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్‌ విసిరిన ముంబై.. ఆపై కింగ్స్‌ పంజాబ్‌ను కట్టడి చేసింది. మాయంక్‌ అగర్వాల్‌(25), …
రో‘హిట్​’.. ముంబై 191
అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ లెవన్​ పంజాబ్ కు ముంబై ఇండియన్స్​192 పరుగుల టార్గెట్ ​ఇచ్చింది. చివరి ఓవర్లలో పొలార్డ్​ హ్యాట్రిక్​ సిక్స్​లతో అద్భుతంగా బ్యాటింగ్​చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి …
‘రాజస్థాన్’ ​టార్గెట్ ​175
దుబాయ్: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​కు కొల్​కత్తా నైట్ ​రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ​175 పరుగుల టార్గెట్​ను విధించింది. టాస్ ​గెలిచిన రాజస్థాన్ ​రాయల్స్ ​ఫీల్డింగ్​ను ఎంచుకుంది. …
సూపర్​ ఓవర్లో బెంగళూరు విజయం..
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సోమవారం రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. బెంగళూరు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. టాస్​ గెలిచిన ముంబై ఇండియన్స్​ బెంగళూరును బ్యాటింగ్​కు పంపింది. బెంగళూరు జట్టులో డివిలియర్స్ (25 బంతుల్లో 52 పరుగులు)కు శివమ్ దూబే (10 …
సన్‌రైజర్స్‌.. రెండో‘సారీ’!
అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా అబుదాబి వేదికగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో జరిగిన మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్​ఆర్​హెచ్​) ఓటమి పాలైంది. కాగా ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో పరాజయం. గత మ్యాచ్ లో ఆర్సీబీతో ఓడిపోయింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 143 పరుగుల …
గవాస్కర్​జీ ఏంటా మాటలు! అనూష్క ఫైర్​
మాజీ క్రికెట​ర్​ సునీల్​ గవాస్కర్​పై టీంఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్​ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్​ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం …
కేఎల్​ రాహుల్​ సెంచరీ.. పంజాబ్​ ఘనవిజయం
దుబాయ్: ఐపీఎల్​13 సీజన్​లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ చాలెంజర్స్‌ ఘోరంగా ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చతికిలపడింది. ఓపెనర్లు, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్లు విఫలమవడంతో ఆర్సీబీ 97 రన్స్​తేడాతో ఓటమిని …
‘ముంబై’ మెరిసింది
రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్​కలకత్తా నైట్​ రైడర్స్ ఓటమి అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్(కేకేఆర్​)​పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ​జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 …
రో‘హిట్’ మెరుపులు.. ముంబై 195/5
అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్, ముంబై ఇండియన్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబై కెప్టెన్ ​రోహిత్ శర్మ​వీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్​లో 6 సిక్స్​లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్​ ఓపెనర్ ​డికాక్ ​మూడు బంతుల్లో …
సిక్స్​ల మోత.. రాజస్తాన్​ దే విజయం
షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్​కింగ్స్, రాజస్తాన్​ రాయల్స్​ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి రాజస్థాన్​ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ ​కింగ్స్ ​తొలుత టాస్​గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్​కు దిగిన రాజస్తాన్​​ రాయల్స్ …
చెన్నై ‘సూపర్‌’ విక్టరీ
అబుదాబి: ఐపీఎల్‌-13 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన చెన్నై …
ఐపీఎల్​ 13వ సీజన్‌ సంగ్రామం షురూ
కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్‌-13వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్​ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య …
యువనటుడితో గుత్తా జ్వాల ఎంగేజ్​మెంట్
తమిళ హీరో విష్టు విశాల్​ను బాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లాడనున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం విష్ణు ట్విట్టర్​లో ఫొటోలు షేర్​ చేశాడు. రెండేళ్ల నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే జ్వాలను …
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, …
ఆదివారం ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్​
న్యూఢిల్లీ : క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 13 వ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ ఈ నెల 6న(ఆదివారం) విడుదల కానుంది. ఈనెల 19 నుంచి నవంబర్​10 మధ్య జరగబోయే ఈ మెగాటోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహించనున్నారు. …
ఐపీఎల్ నుంచి భజ్జీ ఔట్
దుబాయ్: మరికొద్ది రోజుల్లో మొదలవనున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ జట్టు సభ్యుడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే …
చెస్​లో సరికొత్త రికార్డు
తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి భారత్‌ సంయుక్తంగా పసిడి గెలుచుకుంది. ఇది చెస్‌ ఒలింపియాడ్‌ …
అభిమానులకు కోహ్లీ​ గుడ్​న్యూస్​
టీంఇండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ, తన ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్​ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్​కు సోషల్​మీడియాలో అభినందనలు …
సచిన్‌, ధోనీ, కోహ్లీ.. ఇప్పుడు రోహిత్‌
ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్ధార్‌ సింగ్‌తో కూడిన 12 మంది …
మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత
ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్ (73)‌ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు. జులై 12న కరోనా వైరస్‌ బారిన పడడంతో అతని మొదట లఖ్‌నౌవూలోని ఓ …
క్రికెట్​కు రైనా గుడ్‌ బై
ఢిల్లీ: టీమిండియా స్టార్​ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం …
ఇంటర్​నేషనల్ ​క్రికెట్​కు ధోనీ గుడ్ ​బై
ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు, మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. …
సెప్టెంబర్​ 19న ఐపీఎల్​ స్టార్ట్​
కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్​ప్రీమియర్​లీగ్​(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్​19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్​ప్రపంచ కప్​సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
షమీ.. బౌలింగ్ షురూ
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ.. చాలా రోజుల తర్వాత నెట్స్​ బౌలింగ్ చేశాడు. తన సొంతూరులోని ఫామ్ హౌజ్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్స్​పై అతను బౌలింగ్ యాక్షన్​ను సరి …
కోహ్లీతో పోల్చవద్దు
కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా …
వాళ్లిద్దర్ని ఆపడం కష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్​ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ …
2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు
కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్​ అయిందన్న ఆరోపణలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని లంక క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ బృందం స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు …
వావ్.. కోహ్లీ
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్​నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్​నెస్​ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను …
జొకోవిచ్​కు కరోనా నెగిటివ్
బెలెగ్రేడ్​: పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ప్రపంచ నంబర్​వన్​ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్, అతని భార్య జలెనా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అతని మీడియా బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన …
దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు
బ్రిడ్జ్​టౌన్​: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్​మెన్​ ఎవర్టన్ వీక్స్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరునెలల క్రితం తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన వృద్ధాప్య సమస్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1925లో బార్బడోస్​లో పుట్టిన వీక్స్.. 1947–58 మధ్యకాలంలో విండీస్ …
నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు
న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో సలహాలు ఇచ్చినందుకు ఓసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్.. తనపై మెడపై కత్తిపెట్టాడని కోచ్​గా పనిచేసిన గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ఆ సమయంలో భయపడడం కంటే.. యూనిస్ మూర్ఖత్వానికి నవ్వొచ్చిందన్నాడు. ‘పాక్ జట్టులో యూనిస్ ఖాన్ …
అందుకే నల్లకార్లతో రేస్
లండన్: జాతి వివక్షకు వ్యతిరేకంగా ఫార్మూలా వన్ కూడా గళం కలిపింది. ఈ సీజన్​లో తాము పాల్గొనే ప్రతి రేస్​లో బ్లాక్ కార్లతో బరిలోకి దిగుతామని ఎఫ్–1 టీమ్ మెర్సిడెజ్ ప్రకటించింది. వరల్డ్​లో ఎక్కడా జాతి వివక్ష ఉండకూడదని టీమ్ …
బ్లాక్ లైవ్ మ్యాటర్స్ లోగోతో బరిలోకి
న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్​తో జరిగే మూడు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. …
ఒలింపిక్స్​ వద్దంటే వద్దు
టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్​ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్​కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు …
ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ …
కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత
న్యూఢిల్లీ: కరోనా మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. ఢిల్లీ క్లబ్ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ (53).. వైరస్ బారినపడి మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్ …
కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా
లండన్: ఈ ఏడాది ఆరంభంలోనే తనకు కరోనా సోకినా.. దాని గురించి పెద్దగా తెలియకపోవడంతో తీవ్రమైన ఫ్లూగా అర్థం చేసుకున్నానని ఇంగ్లండ్ మాజీ మాజీ ఆల్​రౌండర్​ ఇయాన్ బోథమ్ వెల్లడించాడు. ‘డిసెంబర్ చివర, జనవరి మొదట్లో నాకు కరోనా లక్షణాలు …
ఇంగ్లండ్​కు పాక్ జట్టు
కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్లోని మాంచెస్టర్​కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత …
కోహ్లీలో నిజాయితీ ఎక్కువ
న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా, సామర్థ్యం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. దానికి తగినట్లుగానే విరాట్​ ఆటతీరును పూర్తిగా మార్చేసుకుంటాడన్నాడు. ఏ మ్యాచ్ అయినా నిజాయితీగా ఆడటమే …
జాతి వివక్షకూ అదే శిక్ష
మాంచెస్టర్: డోపింగ్ కు పాల్పడిన వారిని, మ్యాచ్ ఫిక్సర్లను ఎలాగైతే శిక్షిస్తున్నారో.. జాతి వివక్షకు పాల్పడిన వారిని కూడా అదే తరహాలో దండించాలని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. అప్పుడైతేనే ఈ వివక్షల నుంచి క్రికెట్​ను కాపాడిన వారవుతామన్నారు. …
ప్రేక్షకులు లేకపోతే ఎలా
మెల్​బోర్న్​: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్​లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది …
బౌలర్లను ధోనీ అదుపులో పెట్టాడు
న్యూఢిల్లీ: భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన మొదట్లో ధోనీ.. బౌలర్లను చాలా అదుపులో పెట్టుకున్నాడని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆ తర్వాత క్రమంగా బౌలర్లపై నమ్మకం పెంచుకున్నాడన్నాడు. అదే ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తోందన్నాడు. ‘2007లో …
కోహ్లీ సారథ్యం చాలా భిన్నం
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య శైలి చాలా భిన్నంగా ఉంటుందని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెడతాడని చెప్పాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ శైలి చాలా ప్రత్యేకం. ప్రతిసారి జట్టును ముందుండి …
క్రికెట్​లో బంధుప్రీతి లేదు
న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగా క్రికెట్​లో బంధుప్రీతి లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్​ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నైపుణ్యం లేకుండానే అర్జున్​కు …
ఆలోచనా పరులు ఎక్కువ
జోహెన్స్​బర్గ్​: చెన్నై సూపర్​కింగ్స్​​ డ్రెస్సింగ్ రూమ్​లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్​కింగ్స్​ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ …
శునకంతో షమీ పోటీ
న్యూఢిల్లీ: లాక్​ డౌన్​తో ఇంకా ఔట్​డోర్​ ప్రాక్టీస్ మొదలుపెట్టని టీమిండియా ఫిట్​నెస్​ కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంత మంది ఇంట్లో ఉన్న పెరట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. పేసర్ మహ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. తన …
భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..
న్యూఢిల్లీ: 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను చెంప దెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్​పై నిషేధం వద్దని వేడుకున్నానని మాజీ స్టార్​ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఆ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని భావించినట్లు చెప్పాడు. ‘ఆ మ్యాచ్​లో సచిన్ …
టెన్నిస్ స్టార్ ఇవాని సెవిచ్​కు కరోనా
బెల్​గ్రేడ్​: ప్రపంచ నంబర్​వన్​ జొకోవిచ్ నిర్వహించిన అడ్రియన్ టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లలో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా క్రొయేషియా టెన్నిస్ స్టార్​ గ్రేట్ గొరాన్ ఇవాని సెవిచ్​కు కూడా కరోనా సోకింది. పదిరోజుల క్రితం రెండుసార్లు పరీక్షలు …
వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు
న్యూఢిల్లీ: వన్డేల్లో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఎందుకు వేయించాలని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్​మెన్​ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టై అయితే ట్రోఫీని ఇరుజట్లకు పంచండని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్​ను దృష్టిలో పెట్టుకుని …
హఫీజ్​కు మళ్లీ కరోనా
కరాచీ: తొలిసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలాడు.. తాను స్వయంగా వెళ్లి చేయించుకున్న టెస్టుల్లోనూ నెగెటివ్​గా వచ్చిందన్నాడు.. మూడోసారి జరిపిన పరీక్షలో మళ్లీ పాజిటివ్ అంటున్నారు పాక్ బ్యాట్స్​మెన్​ హఫీజ్. కరోనా వ్యవహారంలో ఎక్కడా స్పష్టత రావడం లేదు. …
నా కెరీర్​లో అదే మలుపు
న్యూఢిల్లీ: ఐపీఎల్​లో సన్​ రైజర్స్​ హైదరాబాద్​కు ఆడడమే తన కెరీర్​లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త …
మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు
లండన్: 253 ఏళ్ల చరిత్ర ఉన్న మెరిలోబోన్​ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కు తొలిసారి ఓ మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోంది. ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్ ఈ పదవిని చేపట్టనుంది. ప్రస్తుత అధ్యక్షుడు సంగక్కర.. పదవీకాలం …
ధోనీపై స్పెషల్​ సాంగ్​
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్​ రౌండర్​ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన …
భారత్​కు టెస్టులు ఆడడం నా అదృష్టం
న్యూఢిల్లీ: సమయం వచ్చినప్పుడల్లా టెస్ట్ క్రికెట్​పై తన అభిమతాన్ని చాటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. టెస్టులకు ఉండే విలువ ఏ ఫార్మాట్​కు ఉండదని స్పష్టం చేశాడు. ‘మెరిసే తెల్లని దుస్తులతో ఎర్రబంతితో …
విరామం అనుకుంటే పొరపాటే
న్యూఢిల్లీ: ఓవైపు బయోసెక్యూర్ వాతావరణం.. మరోవైపు ఐసోలేషన్ నిబంధనల మధ్య ట్రైనింగ్ చేయడం క్రికెటర్లకు అంత సులువు కాదని ఈసీబీ క్రికెట్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ అన్నాడు. ‘స్టేడియంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు కట్టుకోవడం, వ్యక్తిగతంగా ఎక్కువ సమయం …
ద్రవిడే.. నంబర్​వన్​
న్యూఢిల్లీ: గణాంకాలు, రికార్డుల పరంగా భారత్​లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్​మెన్​ ఎవరంటే ఠక్కున సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. కానీ అభిమానులు మాత్రం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్​కు ఓటేశారు. 50 ఏళ్లలో భారత క్రికెట్​లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్​మెన్​ …
నాకు కరోనా లేదు
కరాచీ: తమ టీమ్​లో పదిమంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారని పాకిస్తాన్​ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించిన మరుసటి రోజే ఆల్​రౌండర్​ మహ్మద్ హఫీజ్ తనకు కరోనా లేదని ప్రకటించాడు. తనతో పాటు కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ బారిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *