Breaking News

About-Us

సామాజికసారథి’ తెలుగు దినపత్రిక డిజిటల్​ మీడియాకు స్వాగతం

Epaper:https://samajikasarathi.epapr.in/

ఇది హైటెక్ ప్రపంచం.. పరుగులు తీసే జీవనం. అందుకనుగుణంగా సంక్షిప్త సమాచారం అరచేతిలో నిక్షిప్తమై ప్రత్యక్షమయ్యేలా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా దానివ్యాప్తి క్షణాల్లో సాగుతోంది. ఇటు హడావుడి జీవనాలు, వాటి అవసరానుగుణంగా విశేషాలు, సంఘటనలు.. ఒక్కటేమిటి సమస్తం మన అరచేతిలోకి వచ్చి చేరాలి. ఇదే వెబ్‌ పాత్రికేయం.. వ్యక్తి ఎక్కడున్నా, ఎలా ఉన్నా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. పల్లె మొదలుకుని నగరం వరకూ వార్తలు కదలాలి. ఇదే ఒరవడిలో సారథి ప్రయాణం సాగిస్తోంది.

   కల్పితాలకు తావు లేకుండా వార్తలు, కథనాలు, ఆయా రంగాల అంతరంగాన్ని పాఠకుల ముందు ఉంచే యజ్ఞం చేస్తోంది. నిష్పాక్షిక విధానం అనుసరిస్తూ ముందుకు సాగాలనుకుంటోంది. తెలుగు ప్రపంచంతో పాటు డిజిటల్‌ వరల్డ్​ లో సరికొత్త అడుగులు వేయాలనుకుంటోంది. ప్రాంతం, మతం, కులం, వర్గం, వయో, లింగబేధం చూపని పంథాలో మీ ముందు సగర్వంగా నిలవాలని తపిస్తోంది. అనుక్షణం పాఠకుల సూచనలు, సలహాలు శిరోధార్యంగా భావించి ఆచరణాత్మక మార్గంలో పెట్టాలనుకుంటోంది. అనుభవజ్ఞులైన పెద్దల ఆలోచనలను పంచుకోవాలనుకుంటోంది. అన్నివర్గాల మనోఫలకంపై ముద్ర వేయాలనుకుంటోంది. యువత కోసం ‘యువలోకం’, మహిళామూర్తుల కోసం ‘ఆమె’, సాహితీ సమాలోచనలకు ‘సాహితీలోకం’. ఆరోగ్యం సూచనలు, సలహాల కోసం ‘హెల్త్’, రాజకీయాల తీరుతెన్నుల విశ్లేషణకు ‘పొలిటికల్’, సినీ ప్రపంచపు సంగతుల కోసం ‘సినిమా’, చదువు, ఉద్యోగార్థులకు ‘స్టడీ’.. స్పోర్ట్స్ విశేషాలకు ‘క్రీడలు’, ఆవనిపై చరితను లిఖించినవారి పేరుతో ‘చరితార్థులు’. సమరయోధులు, సంస్కర్తల హృదయాంతరాళాన్ని వినేందుకు ‘గుండె చప్పుళ్లు’, ఆధ్యాత్మికం.. ఇలా అన్నివర్గాల అభిరుచులకు అనుగుణంగా ‘సారథి’కి వన్నెలద్దాం.

            సద్విమర్శ, చక్కని సలహా, చిక్కని ఆలోచన.. ఏదైనా ఆమోదయోగ్యమే. వెబ్‌ పాత్రికేయ రంగంలో బుడిబుడి నడకలతో ప్రారంభించిన ప్రయాణం.. నడవడికలు, ఒడిదొడుకులను సర్దుకుంటూ పాఠకుల హృదయాల్లో పెద్దపీట వేసుకోవాలని మీ నిండు ఆశీస్సులు కోరుకుంటోంది. వాస్తవాలకు ప్రతీకగా బాధ్యతాయుతమైన భావితరాన్ని తీర్చిదిద్దాలనుకుంటోంది.

ఎడిటర్ : వెంకట్ ఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *