![మోడీ స్టేడియంలో రికార్డుల మోత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/axar11.jpg?fit=677%2C409&ssl=1)
అహ్మదాబాద్: మోతేరా స్టేడియంలో రికార్డుల మోత మోగింది. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్(మోతేరా) నరేంద్రమోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన డే అండ్ నైట్ పింక్ బాల్ మూడవ టెస్ట్మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్జట్టును టీమిండియా 112 పరుగులకే ఆలౌట్చేసింది. అనంతరం బ్యాటింగ్చేపట్టిన భారత జట్టు 145 పరుగులు చేయగలిగింది. ఓపెనర్రోహిత్శర్మ 66 పరుగులు చేశాడు. అక్సర్పటేల్6 వికెట్లు తీశాడు. అశ్విన్3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 5 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్‌జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్అయింది. దీంతో 49 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. స్టోక్స్25 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రూట్19 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్‌పటేల్5, అశ్విన్4, సుందర్ఒక వికెట్చొప్పున తీశారు. రెండవ ఇన్సింగ్స్‌లో 49 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఈ సిరీస్‌లో టీమిండియా జట్టు 2-1తో ఆధిక్యం సాధించింది. అక్సర్ పటేల్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.