Breaking News

హఫీజ్​కు మళ్లీ కరోనా

హఫీజ్​కు మళ్లీ కరోనా

కరాచీ: తొలిసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలాడు.. తాను స్వయంగా వెళ్లి చేయించుకున్న టెస్టుల్లోనూ నెగెటివ్​గా వచ్చిందన్నాడు.. మూడోసారి జరిపిన పరీక్షలో మళ్లీ పాజిటివ్ అంటున్నారు పాక్ బ్యాట్స్​మెన్​ హఫీజ్. కరోనా వ్యవహారంలో ఎక్కడా స్పష్టత రావడం లేదు. పీసీబీ తొలిసారి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం పది మంది క్రికెటర్లకు కరోనా సోకినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. అందులో హఫీజ్ కూడా ఉన్నాడు. అయితే ఈ ఫలితాన్ని మరోసారి ధ్రువీకరించుకోవాలనే ఉద్దేశంతో హఫీజ్ స్వయంగా టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. దీంతో అతను క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అయితే హఫీజ్ నుంచి సేకరించిన శాంపిల్స్​ను మరోసారి పరీక్షించి చూడగా పాజిటివ్ గా తేలింది.

పీసీబీ బోర్డు వైద్య బృందాల పరీక్షలను పెద్దగా పట్టించుకోని హాఫీజ్.. క్వారంటైన్​కు వెళ్లకపోవడంతో పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పాజిటివ్ వచ్చిన క్రికెటర్లు సలహాలు, సూచనల కోసం పీసీబీ వైద్య బృందానికి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదని మాజీ కెప్టెన్ ఇంజమామ్ మండిపడ్డాడు.