Breaking News

నేటి నుంచే ఐపీఎల్​ పండుగ

నేటి నుంచే ఐపీఎల్ ​పండుగ

సారథి, క్రీడలు: క్రీడల్లో మహాసంరంభం.. 52 రోజుల పాటు 60 మ్యాచ్ ల మెగా ఈవెంట్ ఐపీఎల్​14వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టే బ్యాట్స్​మెన్లు, యార్కర్లు, కట్టర్లు, గూగ్లీలు, ప్లిప్పర్లు, క్యారమ్ బౌలింగ్​తో వారికి అడ్డుకట్ట వేసే బౌలర్లు క్రికెట్​అభిమానులను మరింత కనువిందు చేయనున్నారు. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండేళ్ల తర్వాత భారత్​లో జరగనుంది. రోహిత్​ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్, విరాట్​కోహ్లీ రాయల్​ చాలెంజర్స్ ​బెంగళూరు, ఎంఎస్​ ధోనీ చెన్నై సూపర్​కింగ్స్, ఇయాన్ ​మోర్గాన్ ​కొల్​కత్తా నైట్ ​రైడర్స్, కేఎల్​రాహుల్​ కింగ్స్ ​పంజాబ్, రిషభ్​పంత్​ ఢిల్లీ క్యాపిటల్స్, సంజూ శాంసన్స్ ​రాజస్థాన్ ​రాయల్స్, హైదరాబాద్ ​సన్​రైజర్స్ కెప్టెన్​ డేవిడ్ ​వార్నర్ ​నేతృత్వంలో ఐపీఎల్​లో జట్లు తలపడనున్నాయి. శుక్రవారం తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది.
క్రికెట్​ ప్రసారమయ్యే చానెళ్లు
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 చానల్స్‌లో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారాలు వీక్షించొచ్చు. దీంతో పాటు ప్రాంతీయ భాషల్లో స్టార్ స్పోర్ట్స్ తమిళం, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ కన్నడ, స్టార్ స్పోర్ట్స్ బంగ్లా, స్టార్ స్పోర్ట్స్ ప్రవాహ్, ఏసియా నెట్ ప్లస్‌లో వీక్షించవచ్చు. ఆదివారాల్లో విజయ్ సూపర్, స్టార్ మా మువీస్, స్టార్ సువర్ణ, స్టార్ జల్సా చానల్స్‌లో ప్రసారం చేస్తారు. ఈ చానల్స్‌తో పాటు డిస్నీ+హాట్‌స్టార్‌లో ఐదు భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. జియో అకౌంట్ ఉన్న వాళ్లు జియో క్రికెట్ టీవీ, ఎయిట్‌టెల్ ఎక్స్‌ట్రీంలో కూడా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను చూడొచ్చు.