Breaking News

రాజస్తాన్​ ఔట్​ !

రాజస్తాన్​ ఔట్​ !

దుబాయ్‌: ఐపీఎల్ ​సీజన్ 13లో భాగంగా దుబాయ్ ​వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్​)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్​ఆర్​) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్​ నిష్క్రమించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే ఓటమి పాలైంది. రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌(35; 22 బంతుల్లో 4×4, 6×1), తెవాటియా(31; 27 బంతుల్లో 4×2, 6×1), శ్రేయస్‌ గోపాల్‌(23 నాటౌట్‌; 23 బంతుల్లో 4×2)మాత్రమే ఆకట్టుకునే స్థాయిలో ఆడారు. మిగతావారు బ్యాటింగ్​లో విఫలమయ్యారు. కేకేఆర్​బౌలర్లలో కమిన్స్‌ నాలుగు వికెట్లు సాధించాడు. వరుణ్‌ చక్రవర్తి, మావి రెండు వికెట్ల చొప్పున తీశారు. నాగర్‌కోటికి వికెట్‌ దక్కింది.
ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. మోర్గాన్‌( 68 నాటౌట్‌; 35 బంతుల్లో 4×5, 6×6) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. శుబ్‌మన్‌ గిల్‌(36; 24 బంతుల్లో 4×6), రాహుల్‌ త్రిపాఠి(39; 34 బంతుల్లో 4×4, 6×2), ఆండ్రీ రసెల్‌(25; 11 బంతుల్లో 4×1, 6×3) ఆకట్టుకున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. మోర్గాన్‌ చివరి దాకా క్రీజ్‌లో ఉండడంతో కలకత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు తీశాడు. కార్తీక్‌ త్యాగి రెండు వికెట్లు, ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్​ చొప్పున తీశారు.