Breaking News

టీ20లో ఇండియా ఘనవిజయం

టీ20లో ఇండియా ఘనవిజయం

అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్​లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్​లో చేదు అనుభవం ఎదురైనా ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌ చేసిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 56; 5×4, 4×6) అద్భుతమైన బ్యాటింగ్​తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డారు. ఓపెనర్​కేఎల్​రాహుల్​నిరాశపరిచారు. మొదటి ఓవర్​లోనే పరుగులేవీ చేయకుండానే డకౌట్​గా వెనుదిరిగాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (13 బంతుల్లో 26; 2×4, 2×6)క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్​బాటపట్టాడు. ఇంగ్లండ్​బౌలర్లు శ్యామ్​కరణ్, క్రిస్​జోర్డన్​, రషీద్​ఒక్కో వికెట్​తీశరు. అంతకుముందు బ్యాటింగ్​చేసిన ఇంగ్లండ్‌ బ్యాట్స్​మెన్లలో జోస్‌ బట్లర్‌(0), డేవిడ్‌ మలాన్‌(24), జేసన్‌ రాయ్‌(46), బెయిర్‌ స్టో (20), మోర్గాన్‌ (28), స్టోక్స్‌(24) పరుగులు చేశారు. సామ్‌ కర్రన్‌(6), జోర్డాన్‌(0)లు నాటౌట్‌ గా మిగిలారు. నిర్ణీత 20 ఓవర్లలో 164/6 చేశారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌(1/28), చహల్‌(1/34) తలో వికెట్‌, సుందర్‌(2/29), శార్ధూల్‌ (2/29) చెరో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్​గా ఇషాన్​కిషన్​ప్రశంసలు అందుకున్నాడు.