కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. చాలా కోట్ల వ్యాక్సిన్లు అందక, ఆక్సిజన్ దొరక్క జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ సహా, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే సంపూర్ణ లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. కొవిడ్దెబ్బకు క్రికెట్మెగాఈవెంట్ఐపీఎల్14వ సీజన్ను బీసీసీఐ రద్దుచేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మేమున్నామని.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ హీరోయిన్అనుష్క దంపతులు ముందుకొచ్చారు. కొవిడ్ బాధితులకు భారీవిరాళం ప్రకటించారు. రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు విరుష్క దంపతులు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా దీని కోసం ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తమ మిత్రులు, అభిమానులను తోచిన మొత్తాన్ని ఇవ్వాలన్నారు.
‘కొవిడ్ వ్యాప్తి కారణంగా దేశంలో క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయి. మన ఆరోగ్య వ్యవస్థకే ఇది సవాల్‌గా మారింది. ఈ సమయంలో ఇండియా కోసం మనమంతా కలిసి పోరాడాలి. కరనా బాధితులకు విరాళాలు సేకరించేందుక నేను, విరాట్ కలిసి కెట్టోలో ఓ క్యాంపెయిన్ ప్రారంభించాం. మీ మద్దతు లభిస్తే మేము సంతోషిస్తాం. ప్రాణాలు కాపాడేందుకు ఎంత మొత్తమైనా ముఖ్యమైందే. మనదేశం బాధపడుతుంటే చూసి.. గుండె తరుక్కుపోతుంది. కాబట్టి, కొవిడ్ బాధితులకు విరాళం ఇచ్చి సహాయం చేద్దాం. ప్రతి రూపాయి ముఖ్యమైనదే’ అని అనుష్క తెలిపింది. తనను పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.