Breaking News

అందుకే నల్లకార్లతో రేస్

నల్లకార్లతో రేస్

లండన్: జాతి వివక్షకు వ్యతిరేకంగా ఫార్మూలా వన్ కూడా గళం కలిపింది. ఈ సీజన్​లో తాము పాల్గొనే ప్రతి రేస్​లో బ్లాక్ కార్లతో బరిలోకి దిగుతామని ఎఫ్–1 టీమ్ మెర్సిడెజ్ ప్రకటించింది. వరల్డ్​లో ఎక్కడా జాతి వివక్ష ఉండకూడదని టీమ్ ప్రిన్సిపల్ టొటోవోల్ఫ్ వెల్లడించాడు. సాధారణంగా మెర్సిడెజ్ కార్లన్నీ సిల్వర్ రంగులో ఉంటాయి. ‘జాతి, వర్ణ వివక్షపై నోరు మెపకుండా ఉండకూడదు. జాతి వివక్షపై మా సంకల్పం, ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో సర్క్యూట్​పై దూసుకుపోతాం. మమ్మల్ని చూసి ఈ వివక్షను అందరూ వ్యతిరేకించాలి. జాత్యాహంకారం నశించిపోయేలా చర్యలు ప్రారంభించాలి. అప్పుడు జాతి వివక్షకు గురైన వారి ఆత్మ శాంతిస్తుంది’ అని వోల్ఫ్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రియా రేస్​లో మెర్సిడెజ్ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్.. బ్లాక్ కార్లతో బరిలోకి దిగనున్నారు.