Breaking News

బ్లాక్ లైవ్ మ్యాటర్స్ లోగోతో బరిలోకి

బ్లాక్ లైవ్ మ్యాటర్స్ లోగోతో బరిలోకి


న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్​తో జరిగే మూడు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్​పై దీనిని ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. ఇప్పటికే ప్రీమియర్ లీగ్​కు చెందిన 20 ఫుట్​బాల్​ క్లబ్స్​ ఈ లోగోను ధరించి జాతి వివక్షకు వ్యతిరేకంగా తమ మద్దత తెలుపుతున్నాయి. ‘ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మాకు అవగాహన ఉంది. ప్రతిఒక్కరూ సమానత్వం, సమన్యాయం అనే అంశాలపై పోరాటం చేస్తున్నారు. విండీస్ క్రికెటర్లుగా మా చరిత్ర ఏమిటో మాకు తెలుసు. భవిష్యత్ తరాలకు మేం మార్గదర్శకులుగా ఉండాలనుకుంటున్నాం. అందుకే ఏ నిర్ణయాన్ని మేం తేలికగా తీసుకోవడం లేదు. వివక్షపై మాట్లాడేవారికి ఇదేలా ఉంటుందో తెలుసు. అందరిలో ఐక్యత, సమన్యాయం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ పేర్కొన్నాడు.