Breaking News

ఐపీఎల్​పై కరోనా పడగ

ఐపీఎల్​పై కరోనా పడగ
  • టోర్నీ నిరవధిక వాయిదా
  • సేఫ్​ ప్లేస్​ లోకి ప్లేయర్స్​
  • బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ఇండియన్ ​ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ ​2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్​–19 పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ​ అయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ కష్టమని భావించిన బీసీసీఐ మెగా ఈవెంట్​ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మంగళవారం అధికారక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 సీజన్ షురూ కాగా, మే 2వ తేదీ వరకు 29 మ్యాచ్‌లను బీసీసీఐ దిగ్విజయంగా నిర్వహించగలిగింది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా, టోర్నీని అర్థాంతరంగా నిలిపివేయడం ఇదే తొలిసారి కావడం క్రికెట్​ అభిమానులకు నిరాశ కలిగించే అంశం. టోర్నీ వాయిదాపడటం ద్వారా బీసీసీఐకి రూ.2,120వేల కోట్ల మేర నష్టం కలగనుంది.