Breaking News

విరామం అనుకుంటే పొరపాటే

విరామం అనుకుంటే పొరపాటే

న్యూఢిల్లీ: ఓవైపు బయోసెక్యూర్ వాతావరణం.. మరోవైపు ఐసోలేషన్ నిబంధనల మధ్య ట్రైనింగ్ చేయడం క్రికెటర్లకు అంత సులువు కాదని ఈసీబీ క్రికెట్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ అన్నాడు. ‘స్టేడియంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు కట్టుకోవడం, వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడపడం అనుకున్నంత ఈజీ కాదు. మన వ్యవహారాలకు ఇది పూర్తి భిన్నం ఇదేదో విరామం అనుకుంటే సీరియస్​గా తప్పు చేసినట్లే. అన్ని ప్రొటోకాల్స్ పాటించాల్సిందే. దీనిని పక్కనబెడితే.. ప్రతి రోజు రెండు సెషన్స్​లో క్రికెట్ ఉంటుంది. ఆ సమయంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులపై ప్లేయర్లకు అవగాహన ఉందని అదేపనిగా డైలాగ్​లు కొడుతున్నాం. కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి’ అని గైల్స్ వ్యాఖ్యానించాడు.