సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన మహబూబ్ నగర్ సీసీఎస్ లో పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగశేఖర్ రెడ్డి వీఆర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కె.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పైరవీకారులను ఆశ్రయించవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా సామరస్యాలతో మెలగాలని కోరారు. శాంతిభద్రతలకు సహకరించాలని సూచించారు.
- October 20, 2024
- Top News
- BIJINEPALLY
- MAHABUBNAGAR
- ngkl
- ఎస్సై శ్రీనివాసులు
- నాగర్ కర్నూల్
- బిజినేపల్లి
- మహబూబ్ నగర్ సీసీఎస్
- Comments Off on బిజినేపల్లి ఎస్సైగా కె.శ్రీనివాసులు