Breaking News

క్రికెట్​లో బంధుప్రీతి లేదు

న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగా క్రికెట్​లో బంధుప్రీతి లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్​ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నైపుణ్యం లేకుండానే అర్జున్​కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారన్న వాదనను తోసిపుచ్చాడు. అదే జరిగితే అర్జున్, రోహన్ గవాస్కర్​ టీమిండియాలో మంచి స్థితిలో ఉండేవారన్నాడు. టాలెంట్ లేకుండా క్రికెట్​లో రాణించడం కష్టమన్నాడు. ‘క్రికెట్లో బంధుప్రీతి అనే ప్రస్తావనే లేదు. అలా ఉంటే ఇప్పుడు భారత క్రికెట్ ఇలా ఉండేది కాదు. సచిన్ కుమారుడైనంత మాత్రాన నైపుణ్యం లేకపోతే ఎవరూ అవకాశాలు ఇవ్వరు. అన్ని విధాలుగా అర్హుడైతేనే జట్టులోకి తీసుకుంటారు. రోహన్ విషయం కూడా అంతే. భారత్ అతడు ఎన్ని మ్యాచ్​లు ఆడాడో ఓసారి గుర్తు చేసుకోండి. అవగాహన లేకుండా మాట్లడటం సరైంది కాదు. నాకు తెలిసినంత వరకు అండర్–19 సెలక్షన్​లో కూడా అవతవకలు జరగవు. ప్రతిభతో పాటు అన్ని అర్హతలు ఉంటేనే టీమ్​లోకి వస్తారు’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.