Breaking News

కోహ్లీతో పోల్చవద్దు

కోహ్లీతో పోల్చవద్దు

కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా పోల్చాలనుకుంటే పాక్ ఆటగాళ్లతోనే పోల్చండి. ఎందుకంటే మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్​ లాంటి దిగ్గజాలు మాకూ ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా ఘనతలకు సరైన గుర్తింపు వస్తుంది. నేను కూడా బాగా గర్వపడతా. ప్రపంచ క్రికెట్ కూడా నన్ను గుర్తిస్తుంది. కోహ్లీతో పోల్చడం వల్ల అతని నీడలోనే ఉంటున్నట్లుగా ఉంది. దీనివల్ల క్రికెట్​లో వెనుకబడిపోతున్నానని అనిపిస్తుంది’ అని బాబర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీ20ల్లో బాబర్ అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ వన్డేల్లో నంబర్​వన్​ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే, టీ20ల్లో బాబర్ సగటున 50 కాగా, టెస్టుల్లో 45గా ఉంది. ఇక విరాట్ విషయాన్నికొస్తే మూడు ఫార్మాట్లలో 50 సగటు కలిగిన ఏకైక ప్లేయర్​గా రికార్డులకెక్కాడు.