Breaking News

కింగ్స్‌ పంజాబ్‌ అజేయం

పంజాబ్​ అజేయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్​చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4×4), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), గేల్‌(51; 28 బంతుల్లో 4×2, 6×5) ఆకట్టుకున్నారు. మన్‌దీప్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌ జట్టుకు విజయం అందించారు.
ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కేకేఆర్​స్టార్​బ్యాట్స్​మెన్లు మోర్గాన్‌ 25 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్‌(6), నాగర్‌కోటి(6), కమిన్స్‌(1) వెనువెంటనే పెవిలియన్​ బాటపట్టారు. గిల్‌ 45 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 57 పరుగులు సాధించాడు. ఫెర్గ్యూసన్‌ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్‌, క్రిస్‌ జోర్డాన్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో వికెట్‌ తీశారు.