Breaking News

ప్రియమ్​​ గార్గ్​ మెరుపులు

ప్రిమయ్​ గార్గ్​ మెరుపులు


దుబాయ్: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్ ​హైదరాబాద్ ​సన్​రైజర్స్​164 పరుగులు చేసింది. చివరిలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మైమరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్​ గార్గ్​ 51(26), అభిషేక్​ శర్మ31( 24) పరుగులు చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్ ​చాహర్​ రెండు, ఎస్​ఎన్ ​ఠాకుర్ ​ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు. తొలుత టాస్​ గెలిచిన హైదరాబాద్​ బ్యాటింగ్ ​ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్​ను విసిరింది.