Breaking News

షార్ట్ న్యూస్

స్త్రీ నిధి రుణాల స్వాహా పై చర్యలు ఏవి..?

– దొరికితేనే దొంగ… లేకుంటే దొర..– విచారణ ముగిసినా సీసీ పై నో యాక్షన్– సీసీ తో కుమ్మక్కైన డీఆర్డీఏ అధికారులు– రికవరీతో అక్రమాలను మూసిపెట్టేందుకు అధికారుల ప్రయత్నాలు– రికవరీ తో పాటు సీసీ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్న మహిళా సంఘాలు సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ముగిసినా బాధ్యులపై డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవడం […]

Read More
‘సుంకిరెడ్డి’కి హ్యాండిచ్చారు..!

సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్​ అధిష్టానం కల్వకుర్తి టికెట్​ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్​ఎస్​ టికెట్​ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్​ గూటికి చేరారు. […]

Read More

తెలకపల్లి లో రాజేష్ కే జై కొట్టిన జనం

-ఆత్మీయ సమ్మేళనం లో భారీగా కాంగ్రెస్ నేతలుసామాజిక సారధి , నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలోనే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్య నేతలతో కలిసి డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈనెల 20వ తేదీన చేరటంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ పెరిగింది . ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , […]

Read More

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

సామాజిక సారథి , బిజీనేపల్లి: మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రసిడెంట్ కరిగిల్ల దశరథం మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన కులాల ఉద్యమ రథసారథిభారత దేశ చరిత్రలో 29 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ పోరాటం తెలుగు నేల మీద ఈదుములోడిలో పుట్టిందని. మాదిగ దండోరా ఉద్యమం దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని సృష్టించిందని అన్నారు. గత […]

Read More

వనపర్తి శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలిడీఈఓ కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

  • June 3, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on వనపర్తి శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలిడీఈఓ కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

సామాజిక సారథి, వనపర్తి, బ్యూరో: గవర్నమెంట్ రూల్స్ కు విరుద్దంగా సమ్మర్ హాలిడేస్ ముగియకుండానే స్కూల్ ను ఓపెన్ చేయడంతో పాటు ఇష్టమొచ్చిన రేట్లకు బుక్స్, నోట్ బుక్స్ అమ్ముతున్న వనపర్తి శ్రీచైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని శనివారం వనపర్తి ఇంచార్జీ డీఈఓ గోవింద రాజులు కు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్ లో ఉన్న శ్రీచైతన్య స్కూల్ లో […]

Read More

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

  • May 19, 2023
  • TELANAGA
  • Comments Off on ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం పటాన్ చెరు పట్టణంలోని […]

Read More

మద్యం మత్తులో ఏడీఏ హల్ చల్

సామాజికసారథి, బిజినేపల్లి: అగ్రికల్చర్ ఏడీఏ రమేష్ బాబు మద్యం మత్తులో ఆదివారం రాత్రి బిజినేపల్లిలో జాతర నడిరోడ్డుపై హల్ చల్ సృష్టించాడు. జాతరలో కలిసిన నేతలకు మీ గ్రామాల్లో మీరు ఎవరి డైన సరే మీకు నచ్చిన 10 మంది పేరులు పంపు , నేను చూసుకుంటా …. అంటూ ఆర్ఏహెచ్ పథకంలో ‘ఎవరినైనా ఉంటే డబ్బులు కట్టించు నేను ఇప్పిస్తా’ అంటూ ఆఫర్ ఇచ్చారు. రూ.30వేల కట్టి రూ.50వేలు, 70వేలకు అమ్ముకో అని అవతలి వ్యక్తికి […]

Read More

డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్​ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్​ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్​ విజయ్ కుమార్ డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు […]

Read More