Breaking News

ఆలోచనా పరులు ఎక్కువ

జోహెన్స్​బర్గ్​: చెన్నై సూపర్​కింగ్స్​​ డ్రెస్సింగ్ రూమ్​లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్​కింగ్స్​ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ రూమ్. దిగ్గజ కెప్టెన్ ధోనీతో పాటు చాలా మంది ఆలోచనాపరులు ఉన్నారు. వీళ్ల అనుభవం టీమ్​కు అదనపు బలం. ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం ఉంటుంది. అవే మాకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ప్లేయర్ చాలా స్ఫూర్తి ర్తిదాయకంగా నిలుస్తాడు. కాస్త ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు చేస్తారు. నైపుణ్యానికి, అనుభవానికి మా టీమ్​లో కొరత లేదు’ అని డు ఫ్లెసిస్ వ్యాఖ్యానించాడు.