Breaking News

తక్కువ స్కోరే.. ప్చ్​!

తక్కువ స్కోరే.. ప్చ్​!

దుబాయ్‌: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిలపడింది. ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా జరిగిన 43వ మ్యాచ్​లో వార్నర్​సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్​పంజాబ్​12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్​ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. టార్గెట్​ను ఛేదించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత చేసిన తర్వాత వార్నర్‌(35; 20 బంతుల్లో 4×3 , 6×2) ఔట్ అయ్యాడు. ఆ వెంటనే బెయిర్‌ స్టో(19; 20 బంతుల్లో 4×4) పెవిలియన్ ​బాటపట్టాడు. అబ్దుల్‌ సామద్‌(7; 5 బంతుల్లో 4×1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్​ కు క్యూకట్టారు. 19.5 ఓవర్లలో 114 పరుగులకే సన్‌రైజర్స్‌ ఎదురీదలేక ఓటమిని మూటగట్టుకుంది. ఆరుగురు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు రెండంకెల స్కోరు దాటలేదు.
ముందుగా బ్యాటింగ్​కు దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మనదీప్‌ సింగ్‌ ఆరంభించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్‌(20;20 బంతుల్లో 4×2, 6×1) ఔటయ్యాడు. రాహుల్‌(27; 27 బంతుల్లో 4×2, 6×1) ఔటయ్యాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌(12), దీపక్‌ హుడా(0), క్రిస్‌ జోర్డాన్‌(7), మురుగన్‌ అశ్విన్‌(4) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్‌; 28 బంతుల్లో 4×2) దూకుడు పెంచడంతో పంజాబ్​వంద పరుగులను దాటగలిగింది. హైదరాబాద్​బౌలర్లలో సందీప్‌ శర్మ, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు.