Breaking News

‘సన్​రైజర్స్’ ​సూపర్​ విక్టరీ

‘సన్​రైజర్స్​’ సూపర్​ విక్టరీ

దుబాయ్: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్​ కింగ్స్​తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సన్​రైజర్స్ ​హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన హైదరాబాద్ ​బ్యాటింగ్ ​ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్​ విసిరింది. చివరి ఓవర్లలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మెరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్​ గార్గ్ ​51(26), అభిషేక్ ​శర్మ 31( 24) చెప్పుకోదగ్గ పరుగులతో మొత్తం 164 రన్స్​ చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్​ చాహర్ ​రెండు, ఎస్​ఎన్ ​ఠాకుర్​ ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ధోనీ సేన చెన్నై సూపర్ ​కింగ్స్ ​చకచకా వికెట్లను కోల్పోయి మ్యాచ్​ను చేజార్చుకుంది. ఓపెనర్ ​డుప్లెసిస్ ​22 (19), ఎంఎస్ ​ధోనీ 47 (36 నాటౌట్​), రవీంద్ర జడేజా 50 (35, ఐదు ఫోర్లు, రెండు సిక్స్​లు), ఎస్ఎం కరణ్​ 8(3).. టాప్​ ఆర్డర్​లో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్​ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్​ సన్​రైజర్స్​బౌలర్లు భువనేశ్వర్​ కుమార్​ ఒకటి, టి.నటరాజన్రెం డు, అబ్దుల్​అహ్మద్​ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.