Breaking News

ధోనీపై స్పెషల్​ సాంగ్​

ధోనీపై స్పెషల్​ సాంగ్​

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్​ రౌండర్​ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన అభిమానాన్ని పాట రూపంలో వెల్లడించబోతున్నాడు. ‘మహీ సాంగ్’ పేరుతో తానే రాసి, కంపోజ్ చేసిన ఈ పాటను మహీ పుట్టిన రోజు జులై 7న విడుదల చేయనున్నాడు. దానికంటే ముందు పాటకు సంబంధించిన టీజర్​ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. పాటలోని స్టెప్పులకు ‘హెలిక్యాప్టర్’ అని పేరు పెట్టాడు. ‘నా అభిమానులకు ఓ అప్​డేట్​. మహీపై పాట పూర్తయింది. అతని పుట్టిన రోజున రిలీజ్ చేస్తా. ఈ పాటలో కొత్త కొత్త స్టెప్పులు ఉంటాయి. వాటిని చూడాలంటే నన్ను ట్యాగ్ చేయండి. బెస్ట్ డ్యాన్స్​ కంపోజ్ చేశాను. ఇక నుంచి మహీ అఫీషియల్ డ్యాన్స్ ఇదే’ అని బ్రావో ఇన్​స్టాగ్రామ్​లో వ్యాఖ్యానించాడు.