Breaking News

షమీ.. బౌలింగ్ షురూ

షమీ.. బౌలింగ్ షురూ

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ.. చాలా రోజుల తర్వాత నెట్స్​ బౌలింగ్ చేశాడు. తన సొంతూరులోని ఫామ్ హౌజ్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్స్​పై అతను బౌలింగ్ యాక్షన్​ను సరి చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ లో ఉంచాడు.

‘మా బ్రదర్స్​తో కలిసి ఫామ్ హౌజర్​లో క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్’ అని రాసుకొచ్చాడు. అయితే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైనా.. షమీ బౌలింగ్ రిథమ్​లో ఏమాత్రం తేడాలేదు. అద్భుతమైన కట్టర్స్, స్వింగ్​తో మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఔట్​డోర్​ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఫిట్ నెస్​ కోసం షమీ.. కుక్కతో కలిసి పరుగెత్తిన వీడియోను కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.