Breaking News

నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు

నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు

న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో సలహాలు ఇచ్చినందుకు ఓసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్.. తనపై మెడపై కత్తిపెట్టాడని కోచ్​గా పనిచేసిన గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ఆ సమయంలో భయపడడం కంటే.. యూనిస్ మూర్ఖత్వానికి నవ్వొచ్చిందన్నాడు. ‘పాక్ జట్టులో యూనిస్ ఖాన్ భిన్నమైన వ్యక్తి. అన్ని నాకే తెలుసు అని భావిస్తుంటాడు. అందుకే అతనికి కోచింగ్ ఇవ్వడం కష్టం.

అయితే బ్రిస్​బేన్​(2016)లో జరిగిన టెస్ట్ మ్యాచ్​ సందర్భంగా జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. అల్పాహారం సమయంలో బ్యాటింగ్ సూచనలు ఇచ్చేందుకు నేను ప్రయత్నించా. కానీ అతను నా మాట వినలేదు. వెంటనే ఓ కత్తి తీసి నా మెడ మీద పెట్టాడు. పక్కనే మికీఅర్థర్ ఉన్నా ఏం చేయలేకపోయాడు. కోచ్​గా నా ప్రయాణానికి ఆ సంఘటన ఇబ్బందిగా మారినా.. నేను మాత్రం ఆస్వాదించా’ అని ఫ్లవర్ గుర్తు చేసుకున్నాడు.