Breaking News

విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు

విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు

ముంబై: విరుష్క అభిమానులకు గుడ్​న్యూస్. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఈ మేరకు కోహ్లి ట్వీట్‌ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ కోహ్లి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్‌ కోహ్లి పితృత్వ సెలవులపై ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే.

విరాట్​ కోహ్లీ మెసేజ్