Breaking News

భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..

భజ్జీపై నిషేధం వద్దని వేడుకున్నా..

న్యూఢిల్లీ: 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను చెంప దెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్​పై నిషేధం వద్దని వేడుకున్నానని మాజీ స్టార్​ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఆ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని భావించినట్లు చెప్పాడు. ‘ఆ మ్యాచ్​లో సచిన్ ఉన్న జట్టులోనే హర్భజన్ ఉన్నాడు.

నా చెంపపై కొట్టిన తర్వాత మాస్టర్ సీరియస్ అవుతూ వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు మాస్టర్​కు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ మీడియా మాత్రం పెద్దది చేసి చూపించింది. నేను ఏడుస్తూ భజ్జీపై చర్యలు వద్దని వేడుకున్నా. మేం కలిసే ఆడతామని కోరా. ఎందుకంటే హర్భజన్ ఓ దిగ్గజం. భారత్ తరఫున హ్యాట్రిక్ తీసిన బౌలర్. అందుకే అతను టీమ్​లో ఉండాలని కోరుకున్నా. మా వివాదాన్ని పెద్దది చేయొద్దని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడైతే అది ముగిసిన అధ్యాయం’ అని శ్రీశాంత్ వివరించాడు.