Breaking News

జాతి వివక్షకూ అదే శిక్ష

మాంచెస్టర్: డోపింగ్ కు పాల్పడిన వారిని, మ్యాచ్ ఫిక్సర్లను ఎలాగైతే శిక్షిస్తున్నారో.. జాతి వివక్షకు పాల్పడిన వారిని కూడా అదే తరహాలో దండించాలని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. అప్పుడైతేనే ఈ వివక్షల నుంచి క్రికెట్​ను కాపాడిన వారవుతామన్నారు. ‘డోపర్లు, మ్యాచ్ ఫిక్సర్లు, రేసిస్ట్లు ఒకే కోవకు చెందుతారని నేను భావిస్తున్నా. వీళ్లకు శిక్షలు కూడా ఒకే రకంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా.. కఠినంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ల వల్ల క్రికెట్​లో ఎలాంటి సమస్యలు వచ్చినా, తప్పు చేశారని తేలినా ఉపేక్షించొద్దు. డోపింగ్ నిరోధక, అవినీతి నిరోధక క్లాస్లు ఉన్నట్లే.. జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్యలు ఉండాలి’ అని హోల్డర్ వ్యాఖ్యానించాడు.