Breaking News

ప్రేక్షకులు లేకపోతే ఎలా

మెల్​బోర్న్​: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్​లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్ల అభిమానాన్ని నిలబెట్టే స్థాయిలో మ్యాచ్ ఉండాలి. కానీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఏం బాగుంటుంది. భారత్, ఆసీస్ అంటే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు బాక్సింగ్ డే టెస్ట్ నాటికి దేశంలో అందరూ క్రిస్మస్ జరుపుకుంటుంటారు. ఆ సమయంలో 20 వేల సామర్థ్యం ఉన్న ఎంసీజీలో ఎందుకు? అక్కడ కరోనా కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి పెర్త్, అడిలైడ్ మైదానాలయితే బాగుంటుంది. అక్కడ భారత అభిమానులు కూడా ఎక్కువే’ అని టేలర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ జరిగిన భారత్–పాక్ ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లు కేవలం 52 నిమిషాల్లో అమ్ముడుపోయాయి’ అని టేలర్ గుర్తు చేశాడు.