Breaking News

భారత్​దే టీ20 సిరీస్​

ఇండియాదే టీ20 సిరీస్​

  • హార్దిక్​ పాండ్యా వీరోచిత బ్యాటింగ్​
  • హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్​

సిడ్నీ: పొట్టి క్రికెట్​లో టీమిండియా గట్టి సవాల్​ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా ఒక మ్యాచ్​మిగిలి ఉండగానే సీరిస్​ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​చేపట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఫించ్‌ గాయం కారణంగా మ్యాచ్​కు దూరమవడంతో ఆసీస్​ తాత్కాలిక కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ మాస్టర్‌ ఓపెనర్​గా 32 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్​ డీఆర్సీ షార్ట్‌(9) నటరాజన్​ బౌలింగ్ లో ఔటయ్యాడు. స్మిత్‌(46) రాణించాడు. మ్యాక్స్‌వెల్‌ 22, హెన్రిక్యూస్‌ 26 పరుగులు చేశారు. చివరి ఓవర్​లో స్టాయినిస్‌ బ్యాట్​ను ఝళిపించాడు. ఏడు బంతుల్లో సిక్స్‌ సాయంతో 16 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో టి.నటరాజన్​రెండు, వైఎస్​చాహల్, శార్దూల్ ​ఠాకూర్ ​ఒక వికెట్​చొప్పున తీశారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా స్టార్ ​ఓపెనర్లు శిఖర్​ధవన్, కేఎల్​రాహుల్​ మొదటి నుంచే ధాటిగా ఆడారు. కేఎల్​ రాహుల్​ సొగసైన షాట్లతో స్కోరును పరుగెత్తించాడు. 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​తో 30 పరుగులు చేశాడు. శిఖర్​ధవన్​36 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్​లతో 52 పరుగులు చేశాడు. ఈ టైమ్​లో స్విప్​సన్​కు క్యాచ్​ఇచ్చి వెనుదిరగడంతో కెప్టెన్​ విరాట్ ​కోహ్లీ రెండు ఫోర్లు, రెండు సిక్స్​లతో స్కోరును పరుగెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన శాంసన్​ 15 పరుగులకే వెనుదిరిగాడు. హార్దిక్​పాండ్యా, శ్రేయస్​ అయ్యర్ అదే ఊపును కొనసాగించారు. పాండ్యా 22 బంతుల్లో మూడు సిక్స్​లు, రెండు ఫోర్లతో 42 పరుగులతో విన్నింగ్ ​విక్టరీ కొట్టాడు. శ్రేయస్​ అయ్యర్ ​5 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్​తో 12 పరుగులు సాధించాడు. టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్​బౌలర్లలో సామ్స్, టై, స్వీప్​సన్, జంపా ఒక్కో వికెట్ ​చొప్పున తీశారు. ప్లేయర్​ ఆఫ్ ​మ్యాచ్​గా హార్దిక్​పాండ్యా నిలిచాడు.