Breaking News

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​పంజాబ్​పై రాజస్తాన్​రాయల్స్​7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచిన పంజాబ్ ​దూకుడుకు బ్రేక్​ పడినట్లయింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్​చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్‌ రాహుల్‌ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్‌(22; 10 బంతుల్లో 6×3) ఆశించిన స్థాయిలో స్కారు చేయగలిగారు. కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రాజస్తాన్​ బౌలర్లు జోఫ్రా ఆర్చర్​, బెన్​ స్టోక్స్​ రెండు వికెట్ల చొప్పున తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్తాన్​ రాయల్స్​ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఇటు బెన్​ స్టోక్స్​(50, 26 బంతుల్లో 4×6, 6×3), అటు రాబిన్ ఊతప్ప (30, 23 బంతుల్లో, 4×1, 6×2) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. రన్​ రేట్​ 11 ఓవర్ల వరకు 10 తగ్గలేదు. ఆ తర్వాత వచ్చిన శాంసన్ (48, 25 బంతుల్లో 4×4, 6×3) స్కోరు బోర్డు వేగం పెంచే క్రమంలో రనౌట్​ అయ్యాడు. ఇక స్మిత్​(31, 20 బంతుల్లో 4×5), జేసీ బట్లర్​(22, 11 బంతుల్లో 4×1, 6×2) దూకుడగా ఆడడంతో 17.3 ఓవర్లలో రాజస్తాన్​మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులను పూర్తిచేసింది. కింగ్స్​పంజాబ్​బౌలర్లలో అశ్విన్​, సీజే జోర్డన్​చెరో వికెట్​చొప్పున తీశారు.

గేల్​ జస్ట్​ మిస్​

క్రిస్​ గేల్‌ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 99(63 బంతుల్లో 4×6, 6×8)పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ నాలుగో బంతికి గేల్‌ క్లీన్​​బౌల్డ్‌ అయ్యాడు. బంతి బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిటేసింది. దీంతో కొంచె అసహనానికి గురైన గేల్‌ బ్యాట్‌ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్‌ కావడంతో తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఆ తర్వాత తేరుకున్న గేల్‌ బ్యాట్‌ తీసుకుని వెళ్లి ఆర్చర్‌ను అభినందించాడు.