Breaking News

డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

షార్జా: డివిలియర్స్ బ్యాట్స్​తో విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా నైట్ ​రైడర్స్​పై రాయల్​ చాలెంజర్స్​బెంగళూరు 82 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 195 పరుగుల టార్గెట్​ విధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆది నుంచీ పడిక్కల్‌ (32, 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్‌ (47, 37 బంతుల్లో, 4×4, 1×6) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే పడిక్కల్‌ పెవిలియన్‌కు చేరిన తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడటానికి యత్నించి ఫించ్‌.. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం డివిలియర్స్​(73,33 బంతుల్లో, 5×4, 6×6) వచ్చిన తర్వాత ఇన్నింగ్స్‌ స్వరూపాన్ని మార్చేశాడు. సిక్సర్ల మోత మోగించాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో రెండు సిక్సర్లను స్టేడియం అవతలకు తరలించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ (33,28 బంతుల్లో, 1×4) 19వ ఓవర్‌లో తన తొలి బౌండరీ బాదాడు. తొలి 15 ఓవర్లలో 111 పరుగులు చేసిన బెంగళూరు ఆఖరి అయిదు ఓవర్లలో విధ్వంసమే సృష్టించిందని చెప్పొచ్చు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, ఆండ్రురస్సెల్​ చెరో వికెట్​ తీశారు.
లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా ఆదిలోనే చతికిలపడింది. ఓపెనర్​ బన్​టాన్​8 పరుగులకే ఔట్​ అయ్యాడు. శుభ్​మన్ ​గిల్ ​ఇన్నింగ్స్​ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా (34, 25 బంతులు, 3×4, 1×6) ఔట్ ​అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్లు ఎక్కువ సేపు క్రీజ్​లో నిలవలేకపోయారు. ఆండ్రు రస్సెల్​16, రాహుల్​త్రిపాఠి 16 తప్ప ఎవకూ రెండంకెల స్కోరు దాటలేదు. కోల్​కతా నైట్​రైడర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక బెంగళూరు బౌలర్లలో మారిస్, వాషింగ్టన్​ సుందర్ ​రెండేసి, సైని, సిరాజ్, చాహల్, ఉడాన ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.