Breaking News

నేవీ బ్లూ జెర్సీలో టీమిండియా

నేవీబ్లూ జెర్సీలో టీమిండియా

ముంబయి: ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభంకానున్న టీ20, వన్డే టోర్నీల్లో కోహ్లిసేన న్యూజెర్సీలో కనిపిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ గా మారాయి. ఇప్పుడున్న బ్లూ రంగులో కాకుండా నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో బీసీసీఐ అందించిన సరికొత్త కిట్లతో టీమిండియా సభ్యులు ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న న్యూజెర్సీలు 1992 వరల్డ్ కప్ నాటి నేవీబ్లూ రంగు జెర్సీల మాదిరిగానే ఉండడం గమనార్హం.
సిడ్నీకి చేరుకున్న ఆటగాళ్లు
సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా సభ్యులు గురువారం సిడ్నీకి చేరుకున్నారు. కాగా శుక్రవారం నుంచే ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. నవంబర్ 27 నుంచి మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 4 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది.
ఇదీ షెడ్యూల్
తొలివన్డే: నవంబర్ 27 (సిడ్నీ)
రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ)
మూడో వన్డే: డిసెంబర్ 2 (కాన్‌బెర్రా)
తొలిటీ20: డిసెంబర్ 4 (కాన్‌బెర్రా)
రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ)
మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ)
తొలి టెస్ట్: డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్)
రెండో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 (మెల్‌బోర్న్)
మూడో టెస్ట్: జనవరి 7 నుంచి 11 (సిడ్నీ)
నాలుగో టెస్ట్: జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్)