సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ 7వ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం జిల్లాస్థాయి సెలక్షన్లు బుధవారం అచ్చంపేట సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎస్సై ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు జనవరి […]
సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డీజీలు ప్రమోషన్ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పూర్ణచందర్రావు, గోపికృష్ణ బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సారథి న్యూస్, మెదక్: హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలోని పురాతన కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ కలగనుందని ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి చెప్పారు. మెదక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుధవారం సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి భూపాల్ రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభారాణి, ఇన్చార్జ్జిల్లా […]
సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను బుధవారం కరీంనగర్ క్యాంపు ఆఫీసులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్, ఉపాధ్యక్షుడు బి.యాదయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాజబాబు, సమ్మయ్య, అంజయ్య, నూనె రమేష్, ప్రవీణ్ కుమార్, సంగయ్య, రాజయ్య, సంతోష్, డేవిడ్ సన్, సాయిలు, మదన్, స్వామి పాల్గొన్నారు.
సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ గౌడ్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వైద్య ఖర్చులు, కిడ్నీ మార్పిడి కోసం బాధిత కుటుంబసభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.మూడులక్షల ఎల్వోసీని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రగతి భవన్ లో బుధవారం పీఆర్టీయూ, డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పార్వతి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల, కాంట్రావపల్లి, కేశవపురం గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. రూ.1.57 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరిగిందన్నారు. రైతుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వివిధ శాఖల […]