Breaking News

పోరాడి ఓడిన ‘కోల్​కతా’

పోరాడి ఓడిన ‘కోల్​కతా’

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) చివరి దాకా పోరాటం చేసి ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సిక్సర్ల మోత మోగింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన కేకేఆర్​ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 229 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(66, 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 నాటౌట్‌; 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌(38; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. కేకేఆర్‌ బౌలర్లలో నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తికి చేరో వికెట్‌ పడింది. రసెల్‌ కు రెండు వికెట్లు పడ్డాయి.
అనంతరం బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ ​మొదటి నుంచీ వీరోచిత పోరాటమే చేసింది. శుభ్​మన్ ​గిల్ 28( 22 బంతులు, 4 ఫోర్లు, ఒక 6), రానా 58( 35 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఇయాన్​ మోర్గాన్​ 18 బంతుల్లో 5 సిక్స్​లు, ఒక ఫోర్​తో 44 పరుగులు చేశాడు. రాహుల్​ త్రిపాఠి 16 బంతుల్లో 3 సిక్స్​లు, 3 ఫోర్లు) 44 పరుగులు చేశాడు. ఇయాన్​ మోర్గాన్​, రాహుల్​ త్రిపాఠి క్రిజ్​ ఉన్నంత సేపు సిక్స్​ల మోత మోగింది. ఒక దశలో కోల్​కతా గెలుస్తుందని అంతా భావించారు. ఇంతలో మోర్గాన్​ బౌండరీ వద్ద క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. ఒక్కసారిగా గెలుపు ఆశలు తలకిందులయ్యాయి. లక్ష్య ఛేదనలో భాగంగా కేకేఆర్​ 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ క్యాపిటల్స్​ బౌలర్లలో నార్త్​జే కు మూడు, హెవీ పటేల్​కు రెండు, రబడ, ఏ మిశ్రా, స్టాయినీస్​కు ఒక్కో వికెట్ చొప్పున పడ్డాయి.