సామాజిక సారథి, వైరా: వైరాలోని సత్యసాయి వేద పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంబమూర్తి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సిలివేరు వినయ్ కుమార్ కు టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్ రావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్ రావు, లైన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ, చింతనిప్పు వెంకటయ్య, నంబూరి మధు రూ.20వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రభాకర్, శ్రీకాంత్, నాగేశ్వరరావు, అన్నపూర్ణ, శ్యాంబాబు, మాజీ సర్పంచ్ మేడూరి రామారావు పాల్గొన్నారు.