మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్డౌన్ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. అందుకే రాణించలేకపోతున్నాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అనూష్క చాలా సీరియస్‌గా స్పందించారు. ‘గవాస్కర్జీ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. కోహ్లీ ఆటపై వ్యాఖ్యానిస్తూ నన్ను ఎందుకు లాగారు.. క్రికెటర్ల భార్యలను వివాదాల్లోకి లాగడం మీకు సభ్యతగా అనిపిస్తున్నదా’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మరోవైపు గవాస్కర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణి అయిన అనూష్క శర్మపై ద్వందార్థం వచ్చేలా మాట్లాడం సరికదాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.