Breaking News

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ లాంగ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్​కు చోటు కల్పించారు. 3 టెస్టు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్.. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో మాజీ కెప్టెన్ ఎస్.వెంకట రాఘవన్, సుందరమ్ రవి ఈ బాధ్యతలను నిర్వర్తించారు. గతేడాది ఈ ఇద్దరినీ తొలగించారు. నితిన్ తండ్రి నరేంద్రమీనన్ 1993–1998 మధ్య కాలంలో అంతర్జాతీయ అంపైర్​గా బాధ్యతలు నిర్వర్తించాడు. మధ్యప్రదేశ్ తరఫున రెండు లిస్ట్–ఏ మ్యాచ్​లు ఆడిన నితిన్ 22 ఏళ్ల వయసులో క్రికెట్​ కు గుడ్​ బై చెప్పాడు.