Breaking News

గబ్బాలో టీమిండియా గర్జన

గబ్బాలో టీమిండియా గర్జన

బ్రిస్బెన్: గబ్బా వేదికపై టీమిండియా తడాఖా చూపించింది. 4 టెస్టుల సిరీస్​లో భాగంగా కెప్టెన్​రహానే నేతృత్వంలోని జట్టు 2–1 తేడాతో బోర్డర్​–గవాస్కర్​ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదివరకు ఒక మ్యాచ్​డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత జట్టుపై ప్రసంశల జల్లు కురుస్తోంది. చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్​అయింది. అలాగే భారత జట్టు తొలి ఇన్నింగ్స్​లో 336 పరుగులు చేసి ఆలౌట్​అయింది. అనంతరం సెకండ్​ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా 294 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్​అయింది. ఇక రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్​మన్​గిల్​(91, 146 బంతుల్లో 8×4,2×6), పుజారా(56,211 బంతుల్లో 7×4), రిషబ్​పంత్​(89, 138 బంతుల్లో 9×4,1×6) కీలకమైన ఇన్నింగ్స్​ఆడి భారత్​కు చిరస్మరణీయమైన విజయం అందించారు.

ట్రోఫీతో టీమిండియా

ప్రశంసల వెల్లువ
ఈ గెలుపు దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. జట్టుకు అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని చెప్పారు. భారత క్రికెట్​చరిత్రలో ఇదొక అద్భుతమైన విజయమని, అస్ట్రేలియా గడ్డపై టెస్ట్​ సిరిస్​గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ జట్టులోని ప్రతి ఆటగాడిని ప్రశంసించారు. టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బోనస్​గా రూ.ఐదు కోట్లు ప్రకటించింది. అలాగే భారత జట్టు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిందని బీసీసీఐ కార్యదర్శి జే షా ట్వీట్​చేశారు. జట్టు చరిత్రలోనే ఈ సిరీస్‌ ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఉద్వేగభరిత పోస్టు చేశారు. ‘గొప్ప సిరీస్ విజయాల్లో ఇదొకటి. ప్రతి సెషన్‌కు కొత్త హీరో వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్‌ సరిహద్దులను చెరిపేశాం. గాయాలను, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నాం’ అని భారత క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ట్విట్​ చేశాడు. అలాగే టీమిండియా విజయం సాధించడంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు, ఆంధ్రప్రదేశ్ ​సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి, మంత్రి కె.తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు.

భారత జట్టు విజయ ర్యాలీ