Breaking News

ఒలింపిక్స్​ వద్దంటే వద్దు

ఒలింపిక్స్​ వద్దంటే వద్దు

టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్​ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్​కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1,030 మంది పాల్గొన్నారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు క్రీడలను వాయిదా వేయాలని, లేకపోతే రద్దు చేయాలని కోరుతున్నారు. 46.3 శాతం మంది మాత్రం రీ షెడ్యూల్​పై ఆశలు పెట్టుకున్నారు. గేమ్స్​ను వ్యతిరేకిస్తున్న వారిలోనూ 27.7 శాతం మంది పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. 24.0 శాతం మంది మాత్రం రెండోసారి వాయిదాను కోరుకుంటున్నారు. ప్రేక్షకులు లేకుండా కోరుకునేవారి శాతం 31.1 గా ఉండగా, 15.2 శాతం మంది పూర్తిస్థాయి ఒలింపిక్స్​ను కోరుకుంటున్నారు.