Breaking News

Day: June 16, 2020

టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం

సారథి న్యూస్, హుస్నాబాద్: టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్​ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజాం, సంతోష్, మల్లేశం, రాజు కుమార్, సింగారయ్య, శంకర్, శ్రీనివాస్, సుభాష్, […]

Read More

కేసులు 200 పైనే..

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యారు. మహమ్మారి బారినపడి నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 191 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,406కి చేరింది. 3,027 మంది డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో ప్రసుత్తం 2,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్‌ 13, కరీంనగర్‌ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ అయ్యాయి. […]

Read More

సంక్షేమ రంగానికి పెద్దపీట

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రెండోదఫా 2020–21 బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించింది. మంగళవారం అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శానసమండలిలో డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లుగా ప్రకటించారు. బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయించాయి. వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,419.44 […]

Read More

బోర్డర్​లో టెన్షన్​.. టెన్షన్​

న్యూఢిల్లీ: ఇండియా- చైనా సరిహద్దుల్లో టెన్షన్​ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసువులు బాసినట్లు తెలుస్తోంది. మొదట ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే మరణాలపై చైనా అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం తమ వైపు కూడా నష్టం జరిగిందని మాత్రమే ప్రకటించింది. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద […]

Read More

రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ.29,159.97 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ.మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశారు. రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు, […]

Read More

మెదక్​లో కరోనా పంజా

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. మూడు నెలల్లో 14 నమోదు కాగా, మంగళవారం ఒకేరోజు 14 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. పదిరోజుల్లో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, కొండపాకకు చెందిన పలువురికి కరోనా వైరస్​ సోకింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్ మెంబర్ల శాంపిళ్లను సేకరించి టెస్టుకు పంపించారు. మంగళవారం 14మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. మెదక్ పట్టణం […]

Read More

అభివృద్ధికే అధికప్రాధాన్యం

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వంసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ పరిధిలోని జూబ్లీపురంలో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ స్వాతి , కొల్లు పద్మ, సర్పంచు బలరాం, టీఆర్​ఎస్​ నాయకులు వనమా […]

Read More

సీఎం సహాయనిధికి విరాళాలు

సారథి న్యూస్​, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావును మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, సినీ ఫొటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు వివిధ సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందించాయి. హైదరాబాద్ లోని ఫతేనగర్ స్టీల్ మర్చంట్స్​ అసోసియేషన్ రూ.8.51 లక్షలు, శాంత బాగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అసోసియేషన్ రూ.1.5వేలు, సికింద్రాబాద్ లోని పుష్ప ట్రెండింగ్ కంపెనీ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వాటికి […]

Read More