Breaking News

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడాకారులుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యం, క్రీడలకు కూడా ఇవ్వాలని కోరారు. మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కొల్లాపూర్ చౌరస్తా లో క్రాస్ కంట్రీ సెలక్షన్స్​వారు ప్రారంభించారు. అండర్-16,18,20  బాల, బాలికలతో పాటు మెన్ 10కి.మీ., 5 కి.మీ., 4 కి.మీ, 2కి.మీ. విభాగంలో రాష్ట్రస్థాయి సెలక్షన్స్​నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభచూపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19న కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో స్పాన్సర్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పరుశరామ్, ట్రెజరర్ శ్రీనుయాదవ్, సీనియర్ జాతీయ స్థాయి క్రీడాకారులు భిక్షపతి, ఎ.వెంకటేశ్వర్లు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.