Breaking News

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్​ వచ్చేసింది

దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరగనుంది. అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభ వేడుకలు.. రాత్రి 7.30 కు మ్యాచ్ మొదలవనుంది. రెండో రోజు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ ను ఢీకొననుంది. ఇక సెప్టెంబర్ 21 న సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరగనుంది. 53 రోజుల పాటు సాగే ఈ మెగాటోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కింది విధంగా ఉంది.

ఐపీఎల్​ షెడ్యూల్​