Breaking News

ఆమె

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు
మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్‌ సుందరి21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటంసుస్మితా సేన్‌, లారాదత్తా తర్వాత ఆమెకే న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ కౌర్‌ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం వరించింది. …
స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత
హైదరాబాద్​: స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండోసారి ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని స్కౌట్స్, గైడ్స్‌ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు. 2015లో తొలిసారి స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ …
పాక్ జలసంధిని ఈదేశారు..
హైదరాబాద్​: హైదరాబాద్‌కు చెందిన జి.శ్యామల(47) అరుదైన రికార్డును నెలకొల్పారు. శ్రీలంక నుంచి ఇండియా మధ్యలో ఉన్న 30 కి.మీ. పాక్ జలసంధిని ఈజీగా ఈదేశారు. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోని రెండో మహిళగా గుర్తింపుపొందారు. శుక్రవారం ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమై 13 గంటల …
అన్నదాతకు అండగా.. సేవే నిండుగా
సారథి న్యూస్, ములుగు: ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి, ఆకుపచ్చ పెన్నుతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక, రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. క్షణం తీరిక లేకుండా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఓ ఉత్తమ ఆఫీసర్​.. కానీ సెలవు దినాల్లో మాత్రం …
స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం
దేశంలోనే తొలి లైన్​ఉమెన్​గా భారతి, శిరీష ఎంపిక రిటన్ ​టెస్ట్, పోల్ ​టెస్ట్​లోనూ పాస్​.. గవర్నర్​తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక అభినందనలు పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే …
ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు
కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్​కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్​దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్​డౌన్​లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి …
కరోనా తెచ్చిన ఆకలి కేకలు
బతకడానికి పనిచేయడం మాత్రమే ఆస్తిగా ఉన్న జీవితాలు వాళ్లవి. చదువులూ, సంపదలూ లేకున్నా ఎలాగైనా బతకగలమనే నమ్మకమే వాళ్లను ఇన్నాళ్లూ నడిపించింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ను నమ్ముకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న తల్లులు వాళ్లు. ఇప్పుడా ఆత్మవిశ్వాసం మీదే దెబ్బపడింది. ఎలాగైనా బతకగలం అనే నమ్మకం సడలిపోతోంది. చేయడానికి పనిలేకుంటే తినడానికి తిండీ ఉండదన్న …
నెలకు రూ.75 జీతం.. మురిసిపోయా
విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. …
ఆమెలో చెట్టంత విశ్వాసం
ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల …
మహిళా సాధికారతను దెబ్బతీసిన కరోనా
మహిళామణుల వ్యాపారాలు కుదేలుఎందరో మగువల ఆశయాలను చిదిమేసిన మహమ్మారి హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం సమాజంతో మనిషి చేసే పోరాటం కంటే గుర్తింపు కోసం అదే మనుషులతో మగువ చేసే పోరాటం చాలా గొప్పది. దానికి మనోధైర్యం మాత్రమే చాలదు. సమాజం సమ్మతించాలి. కుటుంబం సహకరించాలి. అప్పుడు ఆ మగువ అడుగు ముందుకు …
లేడీ సింగం
ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్​. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్​ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్​ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్​లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్​కు …
మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి?
సారథి న్యూస్​, నర్సాపూర్: సంస్కృతంలో గోరింట చెట్టును మేంధికా అంటారు. ఆ పదం నుంచే మెహిందీ అనే పదం వచ్చింది. ప్రాచీన కాలం నుంచి సౌందర్య, ఆరోగ్య సంరక్షణ సాధనాల్లో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. …
‘సుక్క’ చిన్నబోయింది.. ఆకలికి చిక్కి పోయింది
సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ …
పొలం గట్ల నుంచి ప్రపంచస్థాయికి
రన్నింగ్ ట్రాక్​ లో స్వర్ణాల పంటఅవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్ అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్​పై పెట్టిన …
గులాబీ రంగు పెదాల కోసం
ఎదుటి వారిని నోటి మాటతో పలకరిస్తే.. పెదాలపై చిందే చిరునవ్వే ఆ మనిషి మనసును ఆకట్టుకుంటుంది. అలాంటి చిరునవ్వుకు అందాన్ని ఇచ్చేవి పెదాలు. మగువల అందానికి కళ్లు ఎంత ముఖ్యమో.. లేలేత గులాబీ రంగు పెదాలూ అంతే అందం. అలాంటి పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. ఆ అమ్మాయి అన్ని విషయాల్లో కాన్ఫిడెంట్​ …
మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా.. సెమినార్​ను ప్రారంభిస్తున్న అనిత(ఫైల్​ఫొటో) సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది. ‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే …
ఎవరీ లతాకరే
అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలు కాపాడుకోవాలన్నది లక్ష్యం ఆమెది.. తన ఐదోతనాన్ని నిలుపుకోవడం కోసం వయస్సను సైతం లెక్కచేయకుండా ‘మారథాన్’లో పాల్గొన్నది. లక్ష్యం ముందు తన కాళ్లకు గుచ్చుకుంటున్న రాళ్లూరప్పలు కనిపించడం లేదు.. అదే లక్ష్యం.. అదే వేగం.. అదే పరుగు .. బారామతి ప్రజల చప్పట్లు ఆమెను మరింత ఉత్సాహపరిచాయి. అందర్నీ …

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

మహిళా సాధికారతను దెబ్బతీసిన కరోనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *