Breaking News

ఎస్సీ

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

 సామాజిక సారథి, హన్వాడ: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలలకు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు. గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రెండు పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి […]

Read More
ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థికంగా ఎదగాలె

సారథి న్యూస్, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు కట్టుబడి ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ తెలిపారు. సోమవారం బీఆర్కే భవన్ లో డీఐసీసీఐ (దళిత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) బృందం ప్రభుత్వ కార్యదర్శిని కలిసి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత గిరిజన యువత పారిశ్రామికరంగంలో […]

Read More
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల డైరీ ఆవిష్కరణ

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల డైరీ ఆవిష్కరణ

సారథి న్యూస్​, కరీంనగర్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్​ను బుధవారం కరీంనగర్ క్యాంపు ఆఫీసులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్​, ఉపాధ్యక్షుడు బి.యాదయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాజబాబు, సమ్మయ్య, అంజయ్య, నూనె రమేష్, ప్రవీణ్ కుమార్, సంగయ్య, రాజయ్య, సంతోష్, డేవిడ్ సన్, సాయిలు, మదన్, స్వామి పాల్గొన్నారు.

Read More
ఎస్సీ, ఎస్టీల కేసులు పెండింగ్​లో పెట్టొద్దు

ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్​లో పెట్టొద్దు

సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్​లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు […]

Read More
‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్ సరిగ్గా అమలుకావడం లేదని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాష్ట్ర కన్వీనర్ పి.శంకర్ అన్నారు. ప్రత్యేకాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ప్రత్యేక ‌అభివృద్ధి నిధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారోద్యమ కరపత్రాలను మంగళవారం నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ […]

Read More