సామాజికసారథి, బిజినేపల్లి: స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు కూడా ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. వార్డుల విభజన, కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు వంటి ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. దసరా తర్వాత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. అధికారులు అంతా రెడీ చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో బోగస్ ఓట్లు నమోదుచేశారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మేజర్ పంచాయతీ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కానిస్టేబుళ్ల బ్లాక్ మెయిల్ దందాలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ రక్షకభటుడు ఓ దొంగ.. మరోసారి పోలీస్ అవతారమెత్తడం పలువురి విస్తుగొల్పింది. ఈ ఉదంతంలో తాజాగా గురువారం మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనకు పరిచయం ఉన్న మరొకరి తో ఉండడాన్ని కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లు, […]
సామాజిక సారథి , నాగర్ కర్నూల్: నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా దగ్గరికి రా అని తల్లి ముందే ని సిగ్గుగా మాట్లాడి లైంగికంగా వేధించాడు ఒక కామాంధ ఆర్ఎంపి వైద్యుడు .. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మినీ ట్యాంక్ బండ్ రోడ్డు నగల న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ వద్దకు తాడూరు మండలం యత్మతాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ […]
బెంగళూరు: జాతీయ స్థాయిలో పేరొందిన టెక్ ఫెస్ట్ ‘స్టోగో ఫెస్ట్ 2024’ ఈసారి బెంగళూరులో జరగనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఆర్ఆర్ విద్యాసంస్థ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు జయేష్, లిండా వివరించారు. ‘అత్యాధునిక సాంకేతిక వినియోగం.. మానవాభివృద్ధి’ ప్రధాన లక్ష్యంగా ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో జరగనుంది. కాగా, ఈ ఏడాది పిల్లల సంరక్షణలో కృత్రిమమేథ, రోబోటిక్ వినియోగం’అన్న థీమ్ ను అనుసరించి ఈ స్టోగో ఫెస్ట్ […]
ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం సామాజికసారథి, నాగర్ కర్నూల్: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్ బంద్ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే నిండుగా ప్రవహిస్తున్నాయి. భారీగా వానలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినేపల్లి పోలీసులు పరిసర గ్రామాల ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఏ పని లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా పాతబడ్డ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కట్టుకున్న భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఉన్న ఇద్దరు సంతానాన్ని పోషించుకునేందుకు తన భర్త తరపు పొలం ఆసరా అవుతుందనుకున్నది ఆ భార్య. కాని తన దాయాదులు న్యాయంగా తనకు రావాల్సిన తన భర్త పొలాన్ని ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెట్టడంతో సాయం కోసం గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి ని సాయం చేయాలని కోరింది ఆ మహిళ. దీంతో ఆ గ్రామ యువకుడు భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు ఆ […]
# పెరిగిన నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పడకలు# 300 పడకల నుంచి 605 పడకలకు పెంపు# ఫలించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషి# హెల్త్ మినిష్టర్ దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు ప్రజలకు వైద్యం కష్టాలు తీరనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కాలేజీ పడకలు భారీగా పెరుగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కేవలం 300 పడకల ఆసుపత్రి ఉండగా రోగులకు సరిపడ వైద్య సేవలు […]