సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రగతి భవన్ లో బుధవారం పీఆర్టీయూ, డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పార్వతి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.