Breaking News

RYTHUVEDIKA

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

సారథి, రామాయంపేట: విద్యుత్ తీగల స్తంభాల మధ్య దూరం తగ్గించి పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సహాయ వేదిక మెదక్ జిల్లా ప్రతినిధులు డి వెంకటేశం, ఎ.రవీందర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల బాబు అనే రైతు ఎకరా పొలంలో వరి పంట సాగుచేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో అరెకరా పొలం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న రైతు సహాయ వేదిక గ్రూప్ […]

Read More
పంట సాగులో ఎరువులు తగ్గించండి

పంట సాగులో ఎరువులు తగ్గించండి

సారథి న్యూస్, రామాయంపేట: రైతు వేదికలను రైతుశిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ సూచించారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గురువారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలో యూరియాను తగ్గించేయాలని సూచించారు. తక్కువ మోతాదులో వాడితే పంటకు నష్టం తగ్గి.. మంచి దిగుబడి వస్తుందన్నారు. అలాగే పంటలకు తెగుళ్లు వస్తే వాటికి సరిపడా మందులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, […]

Read More
అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్​చార్జ్ ​వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్​కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]

Read More
పంటలో సస్యరక్షణ పాటించాలి

పంటలో సస్యరక్షణ పాటించాలి

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో అధిక దిగుబడులను పొందడానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నార్లాపూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలో మొగి పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను చల్లుకోవాలని, అలాగే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ లేదా కాసుగామైసీన్ ను పిచికారీ చేయాలని సూచించారు. రైతులంతా […]

Read More
పంట మార్పిడితో రైతులకు మేలు

పంట మార్పిడితో రైతులకు మేలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]

Read More
బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

బీజేపీ కార్యకర్తల అరెస్ట్​

సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]

Read More
రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్​వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు […]

Read More
రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు

రైతుల అభ్యున్నతి కోసమే రైతువేదికలు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్ ​సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, […]

Read More