Breaking News

Year: 2020

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

సారథి న్యూస్​, మహేశ్వరం: అర్హత కలిగి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రూ.1.30 కోట్ల వ్యయంతో నాగారం, మన్సాన్‌పల్లి, మన్సాన్‌పల్లి చౌరస్తా, పెండ్యాల, దుబ్బచర్ల, దిల్‌వార్‌గూడ గ్రామాల్లో రైతు వేదికలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్​ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. […]

Read More
బిగ్​బాస్​ మెరుపుతీగ స్పెషల్ సాంగ్

బిగ్​బాస్​ మెరుపుతీగ స్పెషల్ సాంగ్

రీసెంట్ గా ముగిసింది బిగ్​బాస్​ సీజన్ 4. సూపర్ సన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ షోలో మోనాల్ గజ్జర్ కూడా ఓ కంటెస్టెంట్. బిగ్ బాస్ కు రాకముందే మోనాల్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. గుజరాతీ గాళ్ అయిన మోనాల్ ఫస్ట్ ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠి చిత్రాల్లో నటించింది. మోనాల్ కు తెలుగులో రాని గుర్తింపు ‘వనవరాయన్ వల్లవరాయన్, సిగరం తోడు’ సినిమాలతో […]

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​

సారథి న్యూస్, హైదరాబాద్: నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్​లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జ్​డ్ ఉద్యోగులు, డెయిలీ వేజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, […]

Read More
వెండితెర శకుంతల

వెండితెర శకుంతల

‘గద్దలకొండ గణేష్’ లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించిన పూజాహెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ తో అభిమానులను అలరించనుంది. తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో సందడి చేయనుంది. ఇవి కాక బాలీవుడ్​లో భాయ్ సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కబీ దీవాలీ’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘సర్కస్’ మూవీ కి కమిట్​మెంట్​ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ గాళ్ ఇప్పుడొక హిస్టారికల్ మూవీలో నటించనుందని టాక్. చారిత్రక కథలను అద్భుతంగా […]

Read More
టీచర్ల మహాధర్నా సక్సెస్​

టీచర్ల మహాధర్నా సక్సెస్​

సారథి న్యూస్, ములుగు: విద్యారంగ సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జాక్టో, యూఎస్​పీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందని ములుగు జిల్లా జాక్టో చైర్మన్ ఏళ్ల మధుసూదన్ తెలిపారు. కార్యక్రమానికి ములుగు జిల్లాలోని 9 మండలాల నుంచి తరలివెళ్లినట్లు తెలిపారు. ధర్నాలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం కృష్ణయ్య, ఎస్టీయూ ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, వెంకటాపూర్ అధ్యక్షుడు బండారి జగదీశ్, రామారావు, రమణయ్య, శేషాచలం, గోవర్ధన్, భాస్కర్, మంగపేట […]

Read More
సీఎంను కలిసిన మహిళా కమిషన్​చైర్​పర్సన్​సునీతా లక్ష్మారెడ్డి

సీఎంను కలిసిన మహిళా కమిషన్​ చైర్​పర్సన్ ​సునీతా లక్ష్మారెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ​వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ ఉన్నారు.

Read More
సహకార సంఘం చైర్మన్ మృతి

సహకార సంఘం చైర్మన్ కన్నుమూత

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: గుండెపోటుతో చిన్నశంకరంపేట సహకార సంఘం వైస్ చైర్మన్ గుడికాడి కిష్టగౌడ్(56) సోమవారం మడూర్ గ్రామంలోని తన నివాసంలో కన్నుమూశారు. గతంలో చైర్మన్ పదవిలో కొనసాగిన తిగుళ్ల బుజ్జి మరణించడంతో ఇన్​చార్జ్ ​చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన మరణంతో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. కిష్టగౌడ్ మృతి పట్ల సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

Read More
వేడుకగా సీఎం దత్తపుత్రిక ప్రత్యూష వివాహం

వేడుకగా సీఎం దత్తపుత్రిక ప్రత్యూష వివాహం

సారథి న్యూస్, షాద్​నగర్: సీఎం కె.చంద్రశేఖర్​రావు దత్తపుత్రిక ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహం సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లూర్దుమాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య​అతిథిగా షాద్​నగర్​ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం సీఎం సతీమణి శోభ, గిరిజన, మహిళా సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ తదితరులు ప్రత్యూషను పెళ్లి కూతురు చేశారు.

Read More