సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డీజీలు ప్రమోషన్ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పూర్ణచందర్రావు, గోపికృష్ణ బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సమర్థవంతమైన, కచ్చితమైన సేవలు అందించేందుకు ఈ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బీఆర్కేఆర్భవన్లో కొనసాగుతున్న సెక్రటేరియట్ లోని 8 ప్రభుత్వ శాఖల్లో సేవలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకమైన, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా పనిచేయడానికి వీలవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15 శాఖల్లో అమలు చేస్తున్నామని […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యతలను మండల తహసీల్దార్‌కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలుకానుండడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది పెళ్లికొడుకు, పెండ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. పెండ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న […]