Breaking News

క్రీడల్లో మెరవాలే.. పేరు తేవాలే

క్రీడల్లో మెరవాలే.. పేరు తేవాలే

సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ 7వ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం జిల్లాస్థాయి సెలక్షన్లు బుధవారం అచ్చంపేట సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎస్సై ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు జనవరి 10న ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం, 17న సూర్యాపేట జిల్లాలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​, నల్గొండ జిల్లాలోని మేకల అభినవ్ స్టేడియం, 24న జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ ఎస్.స్వాములు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ​రాములు నాయక్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి పరుశురాం, కోశాధికారి శ్రీను యాదవ్, సభ్యులు భిక్షపతి, శివకుమార్, శ్రీకాంత్, శేఖర్, వాలీబాల్ కోచ్ శివ, స్వేరోస్ ఇంటర్నేషనల్ స్టేట్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.విజయ్ కుమార్, ఏకే రాజు, స్వేరోస్ ఇంటర్​నేషనల్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ నగేష్, మాజీ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులు